![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -69 లో.... రామరాజుని హారతి ఇవ్వమని పూజరి పిల్వగానే.. అది చూడలేక వాడికి ఊళ్ళో ఏం విలువ ఉందని ఇలా చేస్తున్నారు. వాడి లాగే వాడి కొడుకులు అంటూ భద్రవతి సేనాపతి ఇద్దరు అవమానిస్తుంటారు. అది చూడలేక వేదవతి ఎదరు తిరుగుతుంటే తనని రామరాజు ఆపి తీసుకొని వెళ్తాడు.
ధీరజ్ రాత్రి నడుచుకుంటూ వెళ్తుంటే.. తన వెనకాల కొంతమంది రౌడీలు ఫాలో అవుతూ ఉంటారు. ధీరజ్ కోసం ప్రేమ చూస్తుంది. తను వెళ్లడం చూసి సైలెంట్ గా ఉంటుంది. ధీరజ్ ని రౌడీ లు ఎటాక్ చేసి పక్కకి తీసుకొని వెళ్తారు. ఆ ధీరజ్ గాడు చచ్చిపోవాలని రౌడీలతో విశ్వ మాట్లాడడం ప్రేమ విని షాక్ అవుతుంది. ధీరజ్ వెనకల కొంతమంది వెళ్ళడం చుసిన విషయం ప్రేమ గుర్తుచేసుకుంటుంది. వాళ్ళు రౌడీలా అని అనుకుంటుంది. ధీరజ్ కోసం ప్రేమ వెతుకుంటూ ఉంటుంది. ధీరజ్ దగ్గరికి విశ్వ వెళ్లి కొడుతుంటాడు. మరోవైపు ప్రేమకి ఒక దగ్గర ధీరజ్ కంకణం కన్పిస్తుంది. దాన్ని పట్టుకొని ధీరజ్ దగ్గర కి వస్తుంది. అప్పుడే విశ్వ కత్తి తో ధీరజ్ ని పొడవబోతుంటే ప్రేమ చూసి ఆపుతుంది. నిన్ను లేపుకుని వెళ్లి తప్పు చేసాడని విశ్వ అంటాడు. అయితే అందులో నా తప్పు కూడా ఉందని ప్రేమ అంటుంది. అయిన విశ్వ వినడు. ముందు నేను పొడుచుకుంటానని ప్రేమ కత్తి పట్టుకుంటుంది. దాంతో వద్దని రౌడీలని తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు విశ్వ.
ఇక అదే సమయంలో ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చెయ్యకపోవడంతో వేదవతి వాళ్ళు టెన్షన్ పడుతుంటారు. వాడెప్పుడు అంతే అంటూ రామారాజు కోప్పడతాడు. మరోవైపు ధీరజ్ ని ప్రేమ హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. తరువాయి భాగంలో వేదవతి కోపంగా భద్రవతి ఇంటికి వెళ్లి నా కొడుకుని చంపాలని చూస్తావా అని విశ్వ చెంపచెల్లుమనిపిస్తుంది. అప్పుడే రామరాజు వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |